Wed Mar 25 2026 03:23:04 GMT+0530 (India Standard Time)
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి లో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు రోడ్డు మార్గంలో వెళతారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి లో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు వెళతారు. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ విమాన గోపురం తాపడం కోసం కేసీఆర్ పదహారు కిలోల బంగారాన్ని సమర్పిస్తారు.
అభివృద్ధి పనులను...
దీంతో పాటు యాదాద్రిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తారు. తాను స్వయంగా కిలో 16 తులాల బంగారాన్ని ఇస్తానని ప్రకటించడంతో ఈరోజు ఆ మొక్కును కేసీఆర్ తీర్చుకోనున్నారు. జాతీయ పార్టీని ప్రకటించే ముందు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
- Tags
- kcr
Next Story

