Tue Mar 24 2026 16:18:19 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి పది గంటలకు బయలుదేరి మహబూబాబాద్ కు చేరుకుంటారు. 11 గంటలకు అక్కడకు చేరుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంటారు. అక్కడ సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రెండు జిల్లాల్లో భారీ జనసమీకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తులు చేసింది.
- Tags
- kcr
- two districts
Next Story

