Wed Mar 25 2026 08:23:08 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన టీఆర్ఎస్ నూతన కార్యాలయంతో పాటు కలెక్టర్ భవన సముదాయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ప్రతి జిల్లాలో నిర్మించిన నూతన కలెక్టరేట్లను, నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
నూతన కలెక్టరేట్ ను...
ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యహ్నానికి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. లంచ్ తర్వాత నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.
Next Story

