Thu Mar 19 2026 14:45:59 GMT+0530 (India Standard Time)
నేడు నల్లగొండ జిల్లాకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్లలోని యాదాద్రి మెగా ధర్మల్ పవర్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్లకు చేరుకుంటారు.
నాలుగు వేల మెగావాట్ల....
దాదాపు ముప్పయి వేల కోట్లతో ఈ థర్మల్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మొత్తం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ పనులను పరిశీలించేందుకు కేసీఆర్ స్వయంగా వెళుతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు అన్నీ పూర్తయ్యాయి.
Next Story

