Fri Dec 05 2025 18:26:23 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు జిల్లాల్లో నేడు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలిస్తారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ నేడు పర్యటించనున్నారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆయన కలసుకుని మాట్లాడనున్నారు.
నష్టపోయిన రైతులను...
ఉదయం పదకొండు గంటలకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం, గోవిందపురం గ్రామాల్లో పర్యటిస్తారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. నష్టాన్ని స్వయంగా అంచనా వేసేందుకు ఆయన జిల్లాలకు బయలుదేరి వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- Tags
- kcr
- crop damage
Next Story

