Wed Mar 25 2026 11:27:36 GMT+0530 (India Standard Time)
సాయంత్రానికి హైదరాబాద్ కు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ కు ఈరోజు సాయంత్రం చేరుకోనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ కు ఈరోజు సాయంత్రం చేరుకోనున్నారు. గత నాలుగు రోజుల నుంచి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే ద్రౌపది ముర్మును కలవలేదు. దీంతో పాటు జాతీయ నేతలను కూడా కలుస్తారని అనుకున్నారు. కాని ఎవరినీ కలవకుండానే కేసీఆర్ తిరిగి వస్తున్నారు.
నాలుగు రోజుల నుంచి...
నాలుగు రోజుల నుంచి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలకు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి దిశానిర్దేశం చేశారు. జాతీయ నేతలతో సమావేశం అవుతారని కేసీఆర్ భావించినా ఎవరినీ కలవకుండానే తిరుగు ప్రయాణమయ్యారు.
Next Story

