Tue Mar 17 2026 17:31:57 GMT+0530 (India Standard Time)
KCR : నేడు ధర్మపురి, నిర్మల్ కు కేసీఆర్
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సభల్లో పాల్గొననున్నారు.

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆయన నిర్మల్, ధర్మపురి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఉథృతం చేసిన సంగతి తెలిసిందే. రోజుకు రెండు, మూడు సభల్లో ఆయన పాల్గొంటూ మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతున్నారు.
ధర్మపురిలోనూ...
ఈరోజు సాయంత్రం ధర్మపురిలోనూ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ధర్మపురిలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఇప్పటికే సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాభై వేల మంది పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Next Story

