Sun Mar 08 2026 00:13:40 GMT+0530 (India Standard Time)
కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుపై సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ధరణి సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
సంక్షేమ పథకాలు...
దీంతో పాటు వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. కలెక్టర్లు జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై పూర్తి స్థాయి సమాచారంతో రావాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
Next Story

