Wed Mar 25 2026 08:21:33 GMT+0530 (India Standard Time)
నేడు కూడా రైతు సంఘాలతో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. దేశంలోని 20 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ సమావేశం జరిగింది. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రైతు సమస్యలపై చర్చించారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించేందుకు ఈ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినట్ల తెలిసింది.
రైతు ప్రయోజనాలపై....
కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను విస్మరించడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రైతు పథకాలపై చర్చ జరిగింది. దీంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నూతన వ్యవసాయ సాగు పద్ధతులు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ప్రభుత్వాలు ఆదుకుంటున్న తీరుపై చర్చ జరిగింది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈరోజు కూడా రైతులతో కేసీఆర్ సమావేశం జరగనుంది.
Next Story

