Fri Feb 06 2026 06:48:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు.
జాతీయ పార్టీ నేతలను...
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం పూర్తి కావడంతో దాని ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ జాతీయ నేతలను కొందరిని కలిసే అవకాశముందని చెబుతున్నారు. అలాగే జాతీయ మీడియాతో కూడా కేసీఆర్ మాట్లాడతారని చెబుతున్నారు. ఢిల్లీలో పలువురిని కలిసి బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని కోరనున్నారు.
Next Story

