Sat Mar 21 2026 01:56:41 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ ముఖ్య సమావేశం.. అందుకేనట
జాతీయ పార్టీ ప్రకటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు

జాతీయ పార్టీ ప్రకటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. దసరా రోజున పార్టీ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడంతో అంతకంటే ముందు ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమన్వయకర్తలుగా...
జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం ఏ ఏ రాష్ట్రాలలో పర్యటించాల్సిందీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకుంటారు. ప్రతి రాష్ట్రానికి ఒక సమన్వయకర్తను నియమించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమావేశం జరగనుందని తెలిసింది. కొందరు ముఖ్యనేతలను ఇతర రాష్ట్రాలకు సమన్వయ కర్తలుగా నియమిస్తారని చెబుతున్నారు. వారు ఆ రాష్ట్రంలోనే ఉండి పార్టీ కార్యాలయంతో పాటు ఆ రాష్ట్ర నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని చెబుతున్నారు.
Next Story

