Thu Mar 19 2026 05:51:11 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, చీఫ్ విప్ లు ఈ సమావేశానికి ఆహ్వానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, చీఫ్ విప్ లు ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించనున్నట్లు తెలిసింది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ లో ఈ కీలక సమావేశానికి రాజ్యసభ, లోక్సభ పక్ష నేతలను కూడా ఆహ్వానించారు.
రాష్ట్రపతి ఎన్నికపై...
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా తిరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము మరొకరిని బరిలోకి దింపాలా? కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని నిలబడితే దానికి మద్దతివ్వాలా? అన్న దానిపై ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంపై కూడా ఆయన నేతలతో చర్చించనున్నారు.
Next Story

