Wed Mar 25 2026 01:45:40 GMT+0530 (India Standard Time)
రేపు ఉత్తర్ ప్రదేశ్ కు కేసీఆర్
రేపు ఉత్తర్ ప్రదేశ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు

రేపు ఉత్తర్ ప్రదేశ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు మరికొందరు యూపీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తీవ్ర దిగ్భ్రాంతి...
ములాయం మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ములాయం జీవితాంతం బడుగు, బలహీన వర్గాల కోసం చేశారన్నారు. రాంమనోహర్ లోహియా వంటి నేతల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం మరణం తనను కలచి వేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Next Story

