Sat Mar 07 2026 18:13:55 GMT+0530 (India Standard Time)
నేడు మేడారానికి కేసీఆర్.. ప్రముఖులు కూడా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్ హైదరాబాద్ నుంచి మేడారం బయలుదేరి వెళతారు. అక్కడ దాదాపు మూడు గంటల సేపు ఉంటారు. తిరిగి మూడు గంటలకు బయలుదేరి నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వీఐపీల రాకతో...
ఇక తెలంగాణ కుంభమేళాగా భావించే ఈ జాతరకు నేడు మరికొందరు ప్రముఖులు కూడా రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రులు రేణుకాసింగ్, కిషన్ రెడ్డిలు కూడా మేడారం జాతరకు రానున్నరు. అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోనున్నారు.
Next Story

