Tue Mar 24 2026 08:16:22 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఈరోజు లేదా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారని తెలిసింది

ఈరోజు లేదా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారని తెలిసింది. ఆయన దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు వెళతారా? లేక రేపు బయలుదేరి వెళతారా? అన్నది ఖరారు కావాల్సి ఉందని, ఢిల్లీకి ఈరెండు రోజుల్లో కేసీఆర్ వెళ్లడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 4న...
మే 4వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ బయలేదేరి వెళతారంటున్నారు. జాతీయ నేతలను కలవడంతో పాటు జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది.
Next Story

