Tue Mar 24 2026 19:15:12 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహించనున్నారు. ఈ నెల 13,14 తేదీలలో కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ నేతలతో...
బీఆర్ఎస్ పార్టీని అధికారికంగా ప్రకటించిన తర్వాత నేడు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తన పర్యటనలో పలువురు రాజకీయ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. బీజేపీకి వ్యతిరేకంగా కలసి వచ్చే పార్టీ నేతతో ఆయన సమావేశం కానున్నారు.
Next Story

