Mon Dec 08 2025 06:31:43 GMT+0000 (Coordinated Universal Time)
రేపు బీహార్ కు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీహార్ కు వెళ్లనున్నారు. బీహార్ లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీహార్ కు వెళ్లనున్నారు. బీహార్ లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు కేసీఆర్ బయలుదేరి వెళతారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అంద చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన పన్నెండు మంది కూలీల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు.
రాజకీయ పరిణామాలపై...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కేసీఆర్ భోజనం చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. నితీష్ కుమార్ బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ తన బీహార్ ప్రయాణం పెట్టుకున్నారు. అంతకు ముందు ఆయన బీజేపీలో ఉన్నప్పుడు బీహార్ వెళ్లేందుకు కేసీఆర్ ఇష్టపడలేదు. నితీష్ కుమార్ ను కలిసి ఆయనతో తాజా రాజకీయ పరిణామలపై చర్చించనున్నారు.
Next Story

