Thu Mar 19 2026 13:27:40 GMT+0530 (India Standard Time)
కవితకు ప్రమోషన్...కేసీఆర్ ఆలోచన అదే
కల్వకుంట్ల కవితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలు కన్పిస్తున్నాయి

కల్వకుంట్ల కవితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉంది. బండా ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన వెంటనే కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పదవీ కాలం పూర్తి కావడంతో....
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని చేశారు. అయితే కవిత పదవీకాలం పూర్తయింది. ఆమెను రాజ్యసభకు పంపేందుకు, బండా ప్రకాష్ ను కేబినెట్ లోకి తీసుకునేందుకే కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ చేశారంటున్నారు. సో.. త్వరలో కవిత రాజ్యసభకు ఎంపిక కాబోతున్నారు.
Next Story

