Thu Jan 22 2026 09:14:15 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి జిల్లాలకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన 12.45 గంటలకు మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. అక్కడ జిల్లా అధికారుల కాంప్లెక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 1.15 గంటలకు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేయనున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో...
అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నూతన కలెక్టరేట్ భవన కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Next Story

