Thu Mar 26 2026 01:09:51 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో కేసీఆర్ బిజీ బిజీ
కేసీఆర్ నేడు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఢిల్లీ రాజకీయ పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితులపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించుకునే అవకాశముంది.
ఆరోగ్య పరీక్షలు...
తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ లో కేసీఆర్ హెల్త్ టెస్ట్ లు చేయించుకోనున్నారు. కేసీఆర్ కేజ్రీవాల్ తో పాటు మరికొందరు బీజేపీ యేతర నేతలతో సమావేశమయ్యే అవకాశముంది. దీంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వంటి వాటిపై కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం లేకపోలేదు. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను ఇంకా కేసీఆర్ తీసుకోలేదు
Next Story

