Thu Jan 29 2026 02:41:05 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి సమావేశానికి కేసీఆర్ డుమ్మా
తిరుపతిలో మరికాసేపట్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు.

తిరుపతిలో మరికాసేపట్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. దక్షణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశానికి హాజరుకన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
ఈ సమావేశానికి...
సదరన్ జోనల్ కౌన్సిల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛైర్మన్ గా ఉన్నారు. వైస్ ఛైర్మన్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తారు. తిరుపతిలో జరిగే సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున వేరొకరు హజరుకానున్నారు. హోంమంత్రి మహమూద్ ఆలీ హాజరయ్యారు.
Next Story

