Thu Mar 19 2026 02:04:42 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది. ఈరోజు వరంగల్ వెళ్లి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించాలనుకున్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కారణంగా పంట నష్టం ఎక్కువ జరిగింది. వందల హెక్టార్లలో పంటలు నష్టపోయి రైతులు విలవిలలాడుతున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
చివరి నిమిషంలో...
కానీ చివరి నిమిషంలో తన వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఈ పర్యటనను మంత్రులు కొనసాగిస్తారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు పంటలను పరిశీస్తారు. రైతులతో మాట్లాడతారు. దీనిపై నివేదికను సిద్దం చేసి కేసీఆర్ కు సమర్పిస్తారు.
Next Story

