Sun Feb 01 2026 15:04:07 GMT+0000 (Coordinated Universal Time)
నేడు స్టాలిన్ తో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవనున్నారు. నిన్న తమిళనాడు వెళ్లిన కేసీఆర్ కుటుంబంతో కలిసి శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామిని దర్శించుకున్నారు. రాత్రి చెన్నైలోనే బస చేసిన కేసీఆర్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవనున్నారు.
జాతీయ రాజకీయాలపై...
స్టాలిన్ ను కలసి జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ కూటమి ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కేసీఆర్ స్టాలిన్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కూడా కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగానే కూటమిని ఏర్పాటు చేయాలన్న భావనలో ఉన్నారు. అందుకే స్టాలిన్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

