Thu Mar 26 2026 01:13:07 GMT+0530 (India Standard Time)
నేడు జార్ఖండ్ కు కేసీఆర్
నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తేవాలని వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి అక్కడ పదిలక్షల చెక్కును ఇద్దరు అమరజవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘటనలో మరణించిన జవాన్లను ఆదుకునేందుకు కేసీఆర్ జార్ఖండ్ వెళుతున్నారు.
అమరుల కుటుంబాలకు...
చైనాతో జరిగిన యుద్ధంలో మొత్తం 19 మంది జవాన్లు మరణించారు. వీరందరినీ ఆదుకుంటానని గతంలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణకు చెందని కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జార్ఖండ్ పర్యటన సాగనుంది. పనిలో పనిగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అయి రాజకీయాలపై చర్చించనున్నారు.
- Tags
- kcr
- hemath soren
Next Story

