Thu Mar 26 2026 02:41:36 GMT+0530 (India Standard Time)
నేడు ముంబయికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముంబయి బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలవనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముంబయి బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలవనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ముంబయి బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం కేసీఆర్ ముంబయి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
ప్రత్యామ్నాయ కూటమి....
గత కొద్దిరోజులుగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మోదీ వ్యతిరేక శక్తులన్నింటిని కలుపుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ముంబయి పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

