Wed Dec 17 2025 12:51:42 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ ఫాం హౌస్ కు...ప్రగతి భవన్ ను వదిలి... సామాన్యుని తరహాలో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకోలేదు. ఆయన ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. అయితే సాధారణ పౌరుడిగా ఆయన రాజ్‌భవన్ కు బయలుదేరి వెళ్లారని అందరూ భావించినా ఆయన రెండు ప్రయివేటు వాహనాలతోకలసి ఫాం హౌస్ కు వెళ్లారు. కాన్వాయ్ ను కూడా వదిలేసి ఆయన ట్రాఫిక్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సామాన్యుల తరహాలో ఫాం హౌస్ కు వెళ్లిపోయారు.
రాజీనామా లేఖను...
కేసీఆర్ తన రాజీనామా లేఖను వేరే వ్యక్తుల చేత రాజ్‌భవన్ కు పంపుతారా? అన్నది కూడా చర్చ జరుగుతుంది. . తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ కు చేరువవుతున్న సందర్భంలోనే బీఆర్ఎస్ ఓటమి ఖాయమయింది. ప్రస్తుతం 62 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ మరో రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఐ ఒక స్థానంలో గెలిచింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా కేసీఆర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన ఫాం హౌస్‌కు వెళ్లిపోవడంతో ఇప్పుడు రాజీనామాపై సందిగ్దత ఏర్పడింది.
Next Story

