Thu Feb 13 2025 10:14:08 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులతో కేసీఆర్ భేటీ
ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులతో కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను మాత్రమే కలుసుకున్నారు. ఆయనతో ధాన్యం కొనుగోళ్ల పై చర్చలు జరిపారు. పరిస్థితులకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని మాత్రమే చెప్పారు.
కార్యాచరణ కోసం.....
అయితే ఢిల్లీలో మంత్రులు వ్యవహరించిన తీరుపై మంత్రులు కేసీఆర్ కు వివరించినట్లు తెలిసింది. పియూష్ గోయల్ తమ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించిన తీరును కేసీఆర్ కు మంత్రులు వివరించినట్లు తెలిసింది. మంత్రుల ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై కార్యాచరణను సిద్ధం చేసే అవకాశముంది.
Next Story