Fri Dec 05 2025 14:25:23 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే ఫ్రంట్ పై నిర్ణయం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్ సీఎంతో రాజకీయాలపై చర్చించామన్నారు. త్వరలోనే ఇతర పార్టీల నేతలను కలుస్తామని చెప్పారు. దేశానికి కొంత్త అజెండా కావాలన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం, అనుకూలం కాదని, దేశం బాగుకోసమే ఈ ప్రయత్నమన్నారు. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటున్నారని, ఇప్పటివరకూ ఏ ఫ్రంట్ ఏర్పాటు కాలేదన్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని చెప్పారు. దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలన్నారు.
కొత్త పంథాలో...
దేశాన్ని కొత్త పంధాలో నడిపేందుకు అడుగు ముందు పడిందన్నారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తనకు శిబూ సోరెన్ తో మంచి సంబంధాలున్నాయని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిని ఆశించిన అభివృద్ధి జరగడం లేదని కేసీఆర్ అన్నారు. త్వరలోనే ఫ్రంట్ పై తగిన స్పష్టత వస్తుందని కేసీఆర్ తెలిపారు.
- Tags
- kcr
- hemant soren
Next Story

