Thu Mar 19 2026 00:33:31 GMT+0530 (India Standard Time)
నేడు వరంగల్ కు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరోజు పర్యటన నిమిత్తం వరంగల్ కు బయలుదేరి వెళ్లారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరోజు పర్యటన నిమిత్తం వరంగల్ కు బయలుదేరి వెళ్లారు. ములుగు రోడ్డులోని 350 పడకలతో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ ఆసుపత్రిని, వైద్య కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అత్యాధుని సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. రోడ్డు మార్గాన సీఎం కేసీఆర్ బయలుదేరారు.
భద్రకాళి అమ్మవారిని....
అనంతరం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశముంది. అలాగే కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతిని కూడా కేసీఆర్ సందర్శించనున్నారు. మధ్యహ్నానికి పర్యటన ముగించుకుని తిరిగి కేసీఆర్ హైదరాబాద్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Next Story

