Wed Mar 25 2026 19:26:22 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ కి వెళ్లారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ కి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.. కేసీఆర్ కు కొంత పంటి సంబంధిత సమస్య రావడంతో ఆయన ఢిల్లీకి వెళుతున్నారు.
ఈ నెల 11న....
గతంలో ఆయన ఢిల్లీలోని డెంటల్ డాక్టర్ పూనియా వద్ద చికిత్స చేయించుకున్నారు. కేసీఆర్ సతీమణి కూడా ఇటీవల ఢిల్లీలో ఎయిమ్స్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మరోసారి వైద్యులను కలవాలని భావించి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కాగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేయనున్నారు. అప్పటి వరకూ ఢిల్లీలోనే కేసీఆర్ ఉండే అవకాశాలున్నాయి.
Next Story

