Thu Mar 26 2026 02:45:05 GMT+0530 (India Standard Time)
ముంబయి వీధుల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశమవుతారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశమవుతారు. కేసీఆర్ రాక సందర్భంగా ముంబయిలో పెద్దయెత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ముంబయి వీధుల్లో దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు శివసేన నేతలు ఎయిర్ పోర్టులో వేచి ఉన్నారు.
శరద్ పవార్ తోనూ....
కాగా కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశమవుతారు. అలాగే సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా సమావేశమై జాతీయ రాజకీయాల్లో చర్చించనున్నారు. మోదీని గద్దె దించే లక్ష్యంగా కేసీఆర్ దేశంలో తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story

