Sat Dec 20 2025 09:13:06 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేలదే బాధ్యత... కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకం అమలుకు కార్యాచరణ సిద్దమయింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకం అమలుకు కార్యాచరణ సిద్దమయింది. లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గానికి వంద కుటుంబాలను తొలుత ఎంపిక చేయాలని నిర్ణయించారు. లబ్దిదారులు ఎమ్మెల్యేలు దగ్గరుండి చేస్తారు. తమ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలను ఎమ్మెల్యేలే ఎంపిక చేసి వారి పథకానికి అర్హులను చేస్తారు.
వీలయినంత త్వరగా.....
దళిత బంధు పథకాన్ని వీలయినంత త్వరగా అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్లతో కూడా సమాలోచనలు జరిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రాంతాల్లో పరిమితి లేకుండా లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మొత్తం మీద వీలయినంత త్వరగా దళితబంధును అమలు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారు.
- Tags
- kcr
- dalith bandhu
Next Story

