Thu Mar 26 2026 01:09:52 GMT+0530 (India Standard Time)
మరోసారి కేసీఆర్ జిల్లాల పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. మార్చి 8వ తేదీన వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. మార్చి 8వ తేదీన వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా తీర్చిదిద్దడమే మన ఊరు - మన బడి కార్యక్రమం. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మార్చి 8వ తేదీన కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు.
ప్రారంభోత్సవాలతో...
దీంతో పాటు వనపర్తి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రారంభించనున్నారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా ప్రారంభిస్తారు. అనంతరం వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయానికి కేసీఆర్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఇప్పటికే భువనగిరి, యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఈసారి వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు.
Next Story

