Tue Mar 24 2026 17:50:39 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలోనే సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఆయన జాతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఆయన జాతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజుల పాటు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన యాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నుంచి వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
అన్ని రాష్ట్రాల్లో...
బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కలసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోయే విధంగా కేసీఆర్ భేటీలు కొనసాగనున్నాయి. నిన్న ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు మాత్రమే హాజరయ్యారు. రైతు సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. అయితే అన్ని రాష్ట్రాల్లో పార్టీ ప్రతినిధులను ప్రకటించేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నారు.
Next Story

