Thu Mar 19 2026 06:17:52 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో కేసీఆర్.. నేడు కేంద్ర మంత్రులను
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశముంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన కేసీఆర్ ఈరోజు రాష్ట్రపతిని కలవనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి చెందిన వివిధ సమస్యలపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చించనున్నట్లు తెలిసింది. ఎవరెవరిని కలుస్తారన్నది ఇంకా తెలియనప్పటికీ అందుబాటులో ఉన్న మంత్రులను కలుస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
రేపు కూడా...
రేపు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. జాతీయ పార్టీ నేతలతో కూడా సమావేశమవుతారని తెలిసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలపై ఆయన చర్చించనున్నారు. దానితో పాటు జాతీయ రాజకీయాలపై కూడా ఆయన నేతలతో చర్చించే అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయనున్న కూటమిపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు.
Next Story

