Tue Mar 24 2026 06:59:27 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. నిన్ననే కేసీఆర్ ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర కార్యాలయంలో జరిగే యాగం, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రెండు రోజులు...
కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జాతీయ నేతలతోనూ కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. తిరిగి సోమవారం ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశాలున్నాయి.
Next Story

