Wed Mar 25 2026 00:03:21 GMT+0530 (India Standard Time)
మరో రెండు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కొద్దిరోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కొద్దిరోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం యూపీ వెళ్లిన కేసీఆర్ అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు కొందరున్నారు.
ఢిల్లీకి అధికారులు....
అయితే అధికారిక విషయాలపై చర్చించేందుకు ఢిల్లీకి తెలంగాణ అధికారులు తరలి వెళ్లారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన అధికారికంగా సమీక్షను ఢిల్లీలోనే చేయనున్నారు. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో మరో రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశముంది.
Next Story

