Wed Mar 25 2026 11:27:36 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో కేసీఆర్ బిజీ బిజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీ బిజీ గా ఉన్నారు. ఆయన ఈరోజు అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీ బిజీ గా ఉన్నారు. ఆయన ఈరోజు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలనున్నారు. ప్రధానంగా రుణాలపై పరిమితి విధించడంపై కేసీఆర్ వీరితో చర్చించనున్నారు. అప్పులు తీసుకునేందుకు సహకరించాలని కేసీఆర్ నిర్మలా సీతారామన్ ను కోరనున్నట్లు తెలిసింది.
అప్పులపై షరతులు..
ప్రస్తుతం అప్పులపై కేంద్రం విధించిన ఆంక్షలతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని కేసీఆర్ వారికి వివరించనున్నారు. కార్పొరేషన్ ల నుంచి తీసుకున్న అప్పులను కూడా ఎఫ్ఆర్ఎంబీ పరిధిలోకి తేవడంపై కూడా ఆయన అభ్యంతరం తెలపనున్నారని తెలిసింది. అమిత్ షా, నిర్మలా సీతారామన్ లను కలిసిన తర్వాత ఒక క్లారిటీ రానుంది. నిన్న దీనిపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమై చర్చించారు.
Next Story

