Mon Dec 08 2025 09:55:30 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. వసంత విహార్లో నిర్మించిన కొత్త భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీచేరుకున్న కేసీఆర్ నేరుగా బీఆర్ఎస్ నూతన కార్యాలయానికి చేరుకున్నారు. మంచి ముహూర్తాలు ఇక లేకపోవడంతో పనులు పూర్తి కాకపోయినా ఆయన ప్రారంభించారు.
ముహూర్త సమయానికి...
వేద పండితులు నిర్ణయించిన 1.05 నిమిషాలకు సరిగ్గా ప్రారంభించారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన కేసీఆర్ అనంతరం నేతలతో కలసి కార్యాలయంలో పూజలు నిర్వహించారు. తనకు కేటాయించిన కార్యాలయంలో ఆశీనులయ్యారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు,రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
Next Story

