Wed Mar 25 2026 13:09:59 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. గోదావరి వరదల వెనక విదేశీ కుట్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. గోదావరి వరదల వెనక విదేశీ కుట్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. భద్రాచలంలో అధికారులతో సమీక్ష చేసిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల కుట్రలో భాగంగానే ఈ వరదలు వస్తున్నాయని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో క్లౌడ్ బరస్ట్ అనేది కొత్తగా వచ్చిందన్నారు. ఈ కొత్త పద్ధతిలో విధ్వంసం జరిపే కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
గతంలోనూ...
గతంలో లేహ్ లో అలా చేశారన్నారు. ఉత్తరాఖండ్ లో గతంలో క్లౌడ్ బరస్ట్ చేశారని, ఇప్పుుడు ఇక్కడ చేశారని కేసీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని వరదలు వచ్చాయని, అధికారులు దీనిపై అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు. దీనిపట్ల దేశం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సమీక్ష అనంతరం కేసీఆర్ హెలికాప్టర్ లో ఏటూరు నాగారంకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని తెలుసుకోనున్నారు.
Next Story

