Wed Mar 25 2026 14:58:42 GMT+0530 (India Standard Time)
జాతీయ నేతలకు కేసీఆర్ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. జాతీయ నేతలకు ఆయన ఈరోజు ఫోన్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. జాతీయ నేతలకు ఆయన ఈరోజు ఫోన్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లకు కేసీఆర్ ఫోన్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అందరూ ఐక్యంగా కలసి రావాలని ఆయన కోరారు.
రేపు ఎంపీలతో...
మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటు వేదికగా కలసి కట్టుగా పోరాడదామని కేసీఆర్ జాతీయ నేతలను కోరినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీని నిలదీసేందుకు సహకరించాలని ఆయన కోరారు. రేపు ముఖ్యమంత్రి కేైసీఆర్ టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో సమావేశం అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం రేపు జరగనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.
Next Story

