Sun Feb 01 2026 23:00:27 GMT+0000 (Coordinated Universal Time)
ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభం
ఏప్రిల్ 30 వతేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు

ఏప్రిల్ 30 వతేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కొత్త సచివాలయం పనులను పరిశీలించిన కేసీఆర్ చీఫ్ సెక్రటరీ, మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొన్ని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన సచివాలయం ప్రారంభానికి అంతా సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఏప్రిల్ 14న...
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, జూన్ 2వ తేదీన అమరవీరుల స్థూపాన్ని కూడా ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కొత్త సచివాలయ పనులను దాదాపు గంటన్నరకు పైగా కేసీఆర్ పరిశీలించి పలు సూచనలు అధికారులకు తెలిపారు.
Next Story

