Tue Mar 17 2026 13:48:16 GMT+0530 (India Standard Time)
సీఎం కేసీఆర్ కు జ్వరం.. పీఎం పర్యటనకు దూరం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జ్వరం వచ్చినట్లు చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జ్వరం వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి రాలేదు. ప్రధానికి స్వాగతం పలికేందుకు తొలుత వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే జ్వరం రావడంతో ఆయన ప్రధానికి స్వాగతం పలికేందుకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సాయంత్రం.....
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లు విమానాశ్రయానికి వచ్చారు. ఈరోజు సాయంత్రం శ్రీరామనగర్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణలో కేసీఆర్ పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. ప్రధాని మోదీ మాత్రం ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో ఇక్రిశాట్ కు బయలుదేరుతారు.
Next Story

