Wed Mar 18 2026 21:47:28 GMT+0530 (India Standard Time)
మూడు రోజులు సంతాప దినాలు
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. 4,5,6 తేదీలను సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు అధికారిక లాంఛనాలతో రోశయ్య పార్ధీవ దేహానికి అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
కాసేపట్లో కేసీఆర్....
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో రోశయ్య నివాసానికి చేరుకుని నివాళులర్పించనున్నారు. రోశయ్య పార్థీవ దేహం అమీర్ పేట్ లోని ఆయన నివాసంలో ఉంచారు. రేపు పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోసం గాంధీ భవన్ లో కొద్దిసేపు ఉంచుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.
Next Story

