Wed Feb 12 2025 08:28:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారు. నేడు ఢిల్లీకి మంత్రులను పంపనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారు. నేడు ఢిల్లీకి మంత్రులను పంపనున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమై హామీ ఇంతవరకూ లభించలేదు. మరోసారి కేంద్ర మంత్రిని కలిసి వరి కొనుగోలుపై స్పష్టత తీసుకురావాలని కేసీఆర్ మంత్రులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి....
దీంతో ఈరోజు మంత్రులు ఢిల్లీ బయలేదేరి వెళుతున్నారు. కేంద్రమంత్రిని కలసి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరనున్నారు. ఇదే అంశంపై పార్లమెంటు ఉభయ సభలను టీఆర్ఎస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
Next Story