Wed Mar 18 2026 21:12:50 GMT+0530 (India Standard Time)
నేడు జగిత్యాలకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరతారు. 12.30 గంటలకు జగిత్యాలకు చేరుకుంటారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జగిత్యాలలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
బహిరంగ సభలో...
అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. భోజనం అనంతరం మూడు గంటలకు మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి కేసీఆర్ 4.15 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

