Thu Mar 12 2026 15:43:40 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : కలెక్టర్లకు రేవంత్ కీలక సూచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి గ్రామ సభల్లో ప్రజలకు వివరించాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమపథకాలను అందించేలా కలెక్టర్లు పని చేయాలని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉచిత విద్యుత్త్ తో పాటు సన్న బియ్యం వంటి అంశాల ప్రాధాన్యతను వారికి వివరించాలన్నారు.
అర్హులైన అందరికీ...
అలాగే రేషన్ కార్డుల కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రజలకు వారు నిజంగా అర్హులైతే అందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు వారికి ఏ ఏ పథకం అందుతుందో, ఎంతమేరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నది వారికి సవివరంగా గ్రామసభల్లో తెలియజేయాలని కోరారు. లబ్దిదారుల ఎంపిక నిష్పక్స పాతంగా జరగాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించాలని, అనర్హులకు మాత్రం ఎవరు వత్తిడి తెచ్చినా దూరంపెట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ సూచనలు చేశారు. కలెక్టర్ల సమావేశం ఇంకా కొనసాగుతుంది.
Next Story

