Sat Mar 07 2026 21:29:04 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. కీలక అంశాలివే
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణ మాఫీచేయాలన్న ముఖ్యమంత్రి ప్రకటనకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందుకు అవసరమైన నిధులను సమీకరించడానికి అవసరమైన మార్గాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడంతో పెండింగ్ లో ఉన్న ఇరు రాష్ట్రాల సమస్యలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.
అకాల వర్షాలకు...
ఇక అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే రైతులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరగనుంది. కుంగిపోయిన మేడిగిడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలు కూడా అజెండాలో చోటు చేసుకోనున్నాయి.
Next Story

