Sat Mar 07 2026 17:43:26 GMT+0530 (India Standard Time)
రేపు మంత్రివర్గ సమావేశం.. అందుకే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనుంది. కరోనా కట్టడికి తెలంగాణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించనున్నారు.
మంత్రులతో....
ప్రస్తుతం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో సమావేశం అయ్యారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లతో పాటు ప్రత్యామ్నాయ పంటలను వేయడంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ మంత్రులతో చర్చించారు.
నేడు పార్లమెంటరీ సమావేశం...
ఈరోజు టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఉభయ సభల సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా వరి ధాన్యం కొనుగోళ్లు, గోదావరి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేయడానికి టీఆర్ఎస్ సమాయత్తమవుతోంది.
- Tags
- kcr
- cabinet meet
Next Story

