Tue Feb 03 2026 11:23:48 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. వాహనాల రిజస్ట్రేషన్ నెంబరు కోడ్ను మార్చేందుకు?
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోనున్నారు

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 8వ తేదీన జరపాలని నిర్ణయించింది. అయితే సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆ తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ లో పెట్టనున్నారు. దీంతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ లో రాష్ట్ర కోడ్ గా మార్చాలన్న నిర్ణయం కూడా తీసుకునే అవకాశముంది.
ఆరు గ్యారంటీలను...
గత ప్రభుత్వం టీఎస్ గా చేసిన ఈ కోడ్ ను టీజీగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. మరో ఇరవై ప్రధాన అంశాలపై కూడా నేడు కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే ఆరు గ్యారంటీలపైన కూడా చర్చించే అవకాశముంది.
Next Story

